BREAKING
ఇంట్లో ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్లు ఉన్నాయా? అయితే ఈ పొరపాటు అసలు చేయకండి! సూర్య కొత్త సినిమా 'సీన్' గ్లింప్స్ విడుదల: వైవిధ్యమైన సైకో పోలీస్ పాత్రలో స్టార్ హీరో! ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి: ఈ నెల 16న రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ! దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ బిగ్‌బాస్ 10 తెలుగు: హైరిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్.. ఎలిమినేషన్ టెన్షన్ షురూ! 'దృశ్యం 3' ట్రైలర్ వచ్చేసింది: అజయ్ దేవ్‌గణ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ మరోసారి అదుర్స్! భారత్‌లో అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ఏదో తెలుసా? నిమిషాల్లో శత్రు దేశాలను బూడిద చేసే ఆయుధం ఇదే! ఓలీ రాబిన్సన్ అరుదైన ప్రపంచ రికార్డు: శతాబ్దపు అత్యుత్తమ బౌలింగ్ సగటు నమోదు! భారీ బడ్జెట్‌తో 'మహేంద్రగిరి వారాహి': గొప్ప డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాం - నిర్మాత మధు కలిపు రూరల్ బ్యాంకుల్లో 13,706 ఉద్యోగాలకు దరఖాస్తులు షురూ: ఈ నెల 21 లోగా అప్లై చేయండి! హైదరాబాద్‌లో డెలివరీ బాయ్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్: 'ప్రగతి కేంద్రాల' ఏర్పాటు! రణబాలి టీజర్ వచ్చేసింది: విజయ్-రష్మిక మాస్ యాక్షన్ అదుర్స్! ఆహార వైవిధ్యం, ప్రోటీన్ లభ్యతపై దృష్టితో 'రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026' ప్రారంభం యూపీఐ నుండి ప్రపంచ నాయకత్వం వరకు హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి కొత్త దారి

దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ

Select Suryaa Now
 దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ

దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం

100 దేశీ ఆవుల పరిరక్షణకు డాక్టర్ ఆర్ఎస్ఎస్ దేశీ గోశాల కార్యచరణ

  • గరకు స్తంభాల ప్రతిష్ట 

పామూరు, మేజర్ న్యూస్ : 

దేశీ గోవుల పరిరక్షణ, సంరక్షణకు వేదికగా నిలుస్తున్న డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాలలో గరకు స్తంభాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గోశాలకు అవసరమైన గరకు స్తంభాలను పులివెందులకు చెందిన గాలి చిన్న వెంకటేష్‌, ఆయన సతీమణి అంజనా దేవి, కుమారుడు వెంకట సాయి, కుమార్తె తేజశ్రీతో పాటు వారి బంధుమిత్రులు కలిసి దానం చేశారు.ఈ సందర్భంగా దేశీ గోశాల నిర్వాహకులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో 100 దేశీ ఆవులను పరిరక్షించడమే గోశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఒంగోలు, పుంగనూరు, గిరి, హల్లికర్‌, తార్పర్కర్‌, స్వర్ణ కపిల, మల్నాడు గిట్ట తదితర దేశీ ఆవుల జాతులను సంరక్షించే దిశగా గోశాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.ప్రస్తుతం దేశీ గోశాలలో గోవుల పరిరక్షణకు అవసరమైన రెండు కుటుంబాలు, విశాలమైన సాగుభూమి, నీటి వనరులు, పచ్చటి మహావృక్షాలు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ వివరించారు. ప్రకృతి ఒడిలో పక్షిజాతులు, వివిధ రకాల కోళ్లు, బాతులు తదితర జీవులతో గోశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోందన్నారు.

దేశీ గోవుల పరిరక్షణతో పాటు ప్రకృతి, జీవవైవిధ్యాన్ని కాపాడేలా దేశీ గోశాలను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ తెలిపారు.