BREAKING
రాత్రి టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతున్నారా? ఈ ముప్పు తప్పదు! ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే బియ్యం కొనుగోలు లిమిట్ పెంపు! అరంగేట్ర మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ జోర్డాన్ హెర్మన్! టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం: రఘు మాస్టర్, సుమలతతో లేబర్ కమిషన్ చర్చలు! పారా ఆర్చరీలో శీతల్ దేవి సంచలనం: అహ్మదాబాద్ టోర్నీలో స్వర్ణ పతకం కైవసం! వేడివేడి టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే ప్రాణాంతక ప్రమాదం ముందే తెలుసుకోండి! ఇంట్లో ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్లు ఉన్నాయా? అయితే ఈ పొరపాటు అసలు చేయకండి! సూర్య కొత్త సినిమా 'సీన్' గ్లింప్స్ విడుదల: వైవిధ్యమైన సైకో పోలీస్ పాత్రలో స్టార్ హీరో! ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి: ఈ నెల 16న రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ! దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ బిగ్‌బాస్ 10 తెలుగు: హైరిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్.. ఎలిమినేషన్ టెన్షన్ షురూ! 'దృశ్యం 3' ట్రైలర్ వచ్చేసింది: అజయ్ దేవ్‌గణ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ మరోసారి అదుర్స్! భారత్‌లో అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ఏదో తెలుసా? నిమిషాల్లో శత్రు దేశాలను బూడిద చేసే ఆయుధం ఇదే! ఓలీ రాబిన్సన్ అరుదైన ప్రపంచ రికార్డు: శతాబ్దపు అత్యుత్తమ బౌలింగ్ సగటు నమోదు! భారీ బడ్జెట్‌తో 'మహేంద్రగిరి వారాహి': గొప్ప డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాం - నిర్మాత మధు కలిపు

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Select Suryaa Now
శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2026 సెప్టెంబర్ 08: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

????ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లన్ని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆగమానుసారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

????కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.

????ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్, తదితర అధికారులు పాల్గొన్నారు.