BREAKING
దివంగత నేత వైఎస్సార్‌ను తలుచుకుని భావోద్వేగానికి గురైన బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అందరూ కాక్రోచ్‌లే.. ఆ పోరాటంలో నేనూ ఒకడినే: వైఎస్ జగన్ కృత్రిమ మేధ ముప్పు: ఆంథ్రోపిక్ రీసెర్చర్ సంచలన రాజీనామా చిత్తూరు చిన్నారి అరుదైన ఘనత.. పొడవైన సహజ జుట్టుతో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో బండి జియా రెడ్డి ప్రజా పోరాట పాటల భాస్వరం.విమలక్క స్వరం అర్థ శతాబ్దపు సాంస్కృతిక ప్రస్థానంపై ప్రత్యేక కథనం నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్ చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది.. కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??.. న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పుంజుకున్న ప్రపంచ వస్తు వాణిజ్యం చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు

మళ్లీ ప్రజల్లోకి జగన్: ఏపీలో వైఎస్ జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన

Select Suryaa Now
మళ్లీ ప్రజల్లోకి జగన్: ఏపీలో వైఎస్ జగన్ పాదయాత్రపై కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోమారు సుదీర్ఘ యాత్రా రాజకీయం తెరపైకి రానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యే ఉండేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో ప్రజా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.  

పర్చూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు మరియు నేతలతో నిర్వహించినా ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత వ్యూహాత్మకంగా ఎదుర్కొనే దిశగా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. రానున్న కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతూనే, ప్రత్యక్ష ప్రయాణం ద్వారా ప్రజల మన్ననలు చూరగొనేలా ఈ కొత్త రాజకీయ ప్రణాళిక ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ తీసుకోబోతున్న ఈ సాహసోపేత నిర్ణయం ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు కేడర్‌లోనూ కొత్త జోష్ నింపుతోంది.