కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
01సూర్య రెంజల్:
కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆర్డీవో విజయకుమారి పాల్గొని నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు సూచించారు. భక్తులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.