BREAKING
నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్ చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది.. కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??.. న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పుంజుకున్న ప్రపంచ వస్తు వాణిజ్యం చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు $5,000 'ట్రంప్ డివిడెండ్' మూడు నెలల చిన్నారికి అరుదైన గుర్తింపు.. 7–8.5 సెం.మీ సహజ జుట్టు $1,999 ధరతో ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించిన ఆపిల్ బ్రెంట్ చమురు ధర $100 దాటడంతో కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్లు భారత ఆరోగ్య రంగాన్ని కొనియాడిన డబ్ల్యూహెచ్ఓ అధిపతి

చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది..

Select Suryaa Now
చలో హైదరాబాద్ వాయిదా..  18 తర్వాత తదుపరి కార్యాచరణ..   ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది..
 
 సూర్య కరీంనగర్ ప్రతినిధి:
 
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ ఉద్యమం ఆగలేదని కరీంనగర్ జిల్లా ఉద్యోగుల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 8న నిర్వహించిన సన్నాహక సమావేశానికి సుమారు 5 వేల మంది హాజరయ్యారని, జిల్లాకు చెందిన 10 వేల మందికి పైగా ఉద్యోగులు హైదరాబాద్ తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 18వ తేదీ వరకు ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర జేఏసీ ప్రకటించే తదుపరి కార్యాచరణకు మరింత ఉత్సాహంతో సిద్ధమవుతామని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, ఇది వ్యూహాత్మక విరామమేనని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీజీవోల జిల్లా కార్యదర్శి అడ్ల అరవింద్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటా రామస్వామి, పెన్షనర్ల సంఘం నాయకులు ఉస్మాన్ పాషా, కేశవరెడ్డి, ప్రభాకర్‌రావు, టీఎన్జీవోల కోశాధికారి ముప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ ఆర్మీందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, మహిళా నాయకులు ఈ. శారద, సునీత, సరిత, గంగారపు రమేష్, ఒంటెల ప్రసాద్‌రెడ్డి, రాజేష్, భరద్వాజ్, సుమంత్‌రావు, పోలు కిషన్, వాస్తవికు శ్రీమాన్‌రెడ్డి, సత్యనారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ, టీయూటీ, డీటీఎఫ్, ఎస్టీయూ, టీఆర్‌టీఎఫ్, టీజీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. 18వ తేదీ వరకు ఓపికగా ఉండి, అనంతరం రాష్ట్ర జేఏసీ ప్రకటించే కార్యాచరణకు ఐక్యంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.