BREAKING
నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్ చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది.. కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??.. న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పుంజుకున్న ప్రపంచ వస్తు వాణిజ్యం చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు $5,000 'ట్రంప్ డివిడెండ్' మూడు నెలల చిన్నారికి అరుదైన గుర్తింపు.. 7–8.5 సెం.మీ సహజ జుట్టు $1,999 ధరతో ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించిన ఆపిల్ బ్రెంట్ చమురు ధర $100 దాటడంతో కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్లు భారత ఆరోగ్య రంగాన్ని కొనియాడిన డబ్ల్యూహెచ్ఓ అధిపతి

అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్

Select Suryaa Now
అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్


 సూర్య కరీంనగర్ ప్రతినిధి : అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరని జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి తనను గృహనిర్బంధంలో ఉంచి, ఉదయం 6.30 గంటలకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. ఎలాంటి కారణం చూపకుండా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్‌వీ నాయకులే కనిపిస్తున్నట్లుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతుకలను పోలీసుల ద్వారా అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నియంతృత్వ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడే రోజులు వస్తాయని, ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.