గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్
సూర్య కమ్మర్ పల్లి :
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కమ్మర్‌పల్లి మండల పరిధిలోని డీజే (DJ) ఆపరేటర్లు మరియు సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని స్థానిక తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధిక శబ్దాలు చేసే డీజే సిస్టమ్‌లు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం ఉన్నందున, ఉత్సవాల సమయంలో వాటిని ఉపయోగించరాదని స్పష్టం చేశారు.
- గణేష్ మండపాల వద్ద గానీ, శోభాయాత్ర / నిమజ్జనం సమయంలో గానీ డీజే సిస్టమ్‌లు, బాక్స్ వాల్స్ ఉపయోగించరాదు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలను ఏర్పాటు చేస్తే, సంబంధిత డీజే ఆపరేటర్లపై చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు సౌండ్ పరికరాలను సీజ్ చేయడం జరుగుతుంది.ప్రజలు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఎస్ఐ కోరారు.