BREAKING
మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతినడంపై టీటీడీ స్పష్టత.. ఎటువంటి నిర్లక్ష్యం లేదని వెల్లడి! కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు.. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన రచ్చ.. నామినేషన్లు, గొడవలతో హీటెక్కిన వాతావరణం! రేవంత్ ఉచ్చులో ‘కారు’ పడినట్లేనా? ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై వేగంగా కసరత్తు! యుద్ధ మేఘాలు.. సెంచరీ దాటిన క్రూడాయిల్ ధరలు! తిరుమలలో భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి తాజా మార్కెట్ రేట్లు ఇవే! నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే! రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి రాత్రి టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతున్నారా? ఈ ముప్పు తప్పదు! ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: తక్కువ ధరకే బియ్యం కొనుగోలు లిమిట్ పెంపు! అరంగేట్ర మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ జోర్డాన్ హెర్మన్! టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం: రఘు మాస్టర్, సుమలతతో లేబర్ కమిషన్ చర్చలు!

రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి


ఎస్‌బీఐ మేనేజర్‌కు ఖాతాదారుల వినతి
బలవంతపు ఇన్సూరెన్స్ పాలసీలపై ఆందోళన

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖలో రైతులు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు వినియోగదారులు బ్యాంకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. బ్యాంకు సేవల్లో జాప్యం, గంటల తరబడి నిరీక్షణతో పాటు రుణాల కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు.చిన్నపాటి బ్యాంకింగ్ పనుల కోసం కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీంతో రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవసరం లేని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం, పాలసీ తీసుకోకపోతే రుణాల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. అర్హులైన రైతులు, ఖాతాదారులకు బ్యాంకు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సకాలంలో సేవలు అందించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి.బాబయ్య నాయుడు, బీఆర్‌ఎస్ నాయకులు కావలి అంజిలయ్య, యు.కృష్ణ, బాల్‌రెడ్డి, యు.జగదీష్‌తో పాటు వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.