BREAKING
శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా. గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ

Select Suryaa Now
మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ


దువ్వూరు మండలంలో మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ.
దువ్వూరు మండలం సంగటి తిమ్మాయపల్లె  గ్రామంలో ఏరువాక కేంద్రం, కడప ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో మహిళా రైతులకు కిచెన్ గార్డెన్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కడప సమన్వయకర్త డాక్టర్ ఎన్. కృష్ణ ప్రియ పాల్గొని మాట్లాడుతూ కుటుంబ అవసరాలకు సరిపడే విధంగా 5 సెంట్ల స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకునే విధానం గురించి మహిళా రైతులకు వివరించారు. కూరగాయల ఎంపిక, విత్తనాల నాటడం, మొక్కల మధ్య దూరం, సేంద్రియ ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు మరియు చీడపీడల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటి అవసరాలకు తాజా, పోషక విలువలు కలిగిన కూరగాయలను తక్కువ ఖర్చుతో పండించుకోవడం ద్వారా కుటుంబ పోషకాహార భద్రతతో పాటు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో 25 మంది మహిళా రైతులు పాల్గొని కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్  ఎం. ప్రకాష్ మరియు  అమీర్ తదితరులు పాల్గొన్నారు.