బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా.
సంగారెడ్డి ; అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం లో కాంగ్రెస్ శ్రేణుల నిరసన కార్యక్రమంరామ్ నగర్ లోని జగ్గారెడ్డి నివాసం నుండి పాతబస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఅసెంబ్లీ సమావేశాల సందర్భంగా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అరాచకం, గుండాయిజం చేశారు.అసెంబ్లీ లో ప్రజా సమస్యల పై మాట్లాడాల్సింది పోయి, అరాచకానికి పాల్పడటం దారుణం.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి దారుణ ఘటన ఎక్కడా జరగలేదు.వాళ్లకు వాళ్లే నెట్టుకుని, పోలీసులుపై దాడి చేసి, తిరిగి వారే బాధితులన్నట్టు ప్రవర్షిస్దటం సిగ్గు చేటుదళితుల వర్గాన్ని అవమానిస్తూ బి ఆర్ ఎస్ చేసిన వ్యాఖ్యలు, చర్యలు రాష్ట్రం అంతా చూశారు.దళితులు నడిచారని నేలను పసుపునీళ్లతో శుద్ధి చేయడం, బి ఆర్ ఎస్ పార్టీ కుసంస్కారానికి, అనాగరిక చర్యలకు నిదర్శనం.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందడం జీర్ణించుకోలేక బి ఆర్ ఎస్ అరాచకాలకు పాలపడుతున్నారు.దళితులను అవమానిస్తున్న బిఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.