మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో
.
సూర్య. ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా పంటలకు నీటిని వదలాలని ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, తాళ్లపల్లి, జవారిపేట రైతులు గాలిపల్లి -ఇల్లంతకుంట కు కాలువ బ్రిడ్జి పై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ వర్ష కాలం లోనే పంటలు ఎండిపోయే ప్రమాదం వుందని, నెలలో 2,3 సార్లు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం వుంటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్ర చారి రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులు రాస్తారోకో చేస్తున్న రైతులతో ఇరిగేషన్ డి ఇ వేగ్గలం సూర్య ప్రకాష్ మాట్లాడుతూ రైతుల సమస్యను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించి సమస్య కు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం తో ధర్నా ను విరమించారు.లేని యెడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని తేల్చి చెపుతున్నారు హెచ్చరించారు. సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సాగు నీరందించాలని కోరారు.