సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...?
సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా..?
12 గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయంలో కనిపించని అధికారులు
దౌల్తాబాద్,మేజర్ న్యూస్: సీఎం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో అధికారుల సమయపాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీఎం నియోజకవర్గంలోనే అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.