telanagana
ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు
14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
పటాన్‌చెరు : శ్రీ గణేశ్ దేవస్థానం (సిద్ధి వినాయక) ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ గడ్డ, రుద్రారం, మండలం పటాన్‌చెరు, సంగారెడ్డి జిల్లాలోని దేవస్థానంలో సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
సెప్టెంబర్ 14న ప్రారంభం:
బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం వరుసగా పలు రోజులపాటు స్వామివారికి వివిధ సేవలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 25న ప్రత్యేక కార్యక్రమాలు:
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
ప్రత్యేక సేవలకు విరాళాలు.
దేవస్థానం సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో విరాళాలను అందించే అవకాశం కల్పించారు.స్వర్ణపుష్ప పోషకులు – రూ.1,00,000,మహారాజ పోషకులు – రూ.51,000,రాజ పోషకులు – రూ.25,000
పోషకులు – రూ.11,116,అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాత స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.
భక్తులు, దాతలు, ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం నిర్వాహకులు కోరారు.