BREAKING
అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వివేకానందుని సహనం, విశ్వ ఆమోదం సందేశం నేటికీ స్పూర్తిదాయకం మత్స్య రంగానికి మహర్దశ భవిష్యత్తు విద్యకు బాటలు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకున్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు అలుపో ఢిల్లీకి చేరిన రష్యా మంత్రులు లావ్రోవ్, మాంటురోవ్ ఢిల్లీకి చేరుకున్న నైజీరియా విదేశాంగ మంత్రి

సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి..

Select Suryaa Now
సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి..

 

 సూర్య మెట్‌పల్లి:  

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సూర్య  ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్లు జిల్లా ఉప వైద్య అధికారి డా. ముస్కు జైపాల్ రెడ్డి తెలిపారు. సూర్య ఆసుపత్రిలో అర్హత లేని వైద్యుడితో  ఈ ఎన్ టి స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు  ఈ నెల 2వ తేదీన డా. జైపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాల ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు. అయితే యాజమాన్యం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో గురువారం రాత్రి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినట్లు డా. జైపాల్ రెడ్డి తెలిపారు. విచారణలో అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తేలిందని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో నమోదిత, అర్హత కలిగిన వైద్యులతోనే వైద్య సేవలు అందించాలని  సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.