యశోద హాస్పిటల్స్‌లో ఇన్-హౌస్ జన్యు విశ్లేషణ సదుపాయం
వేగవంతమైన, ఖచ్చితమైన క్యాన్సర్ నిర్ధారణకు అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సాంకేతికత…
డా.శిఖర్ కుమార్ ఏండి, క్యాన్సర్ స్పెషలిస్ట్ అంకలజీ…
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించేందుకు యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ అత్యాధునిక ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్‌జీఎస్) సదుపాయాన్ని ప్రారంభించింది, ఈ వివరాలను గురువారం రోజున యశోద బ్రాంచ్ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా శిఖర్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన జన్యు మార్పులను వేగంగా, ఖచ్చితంగా గుర్తించి, రోగికి సరైన చికిత్సను ఎంపిక చేసేందుకు వైద్యులకు సహకారం అందుతుంది.ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లతో పాటు ఇతర క్యాన్సర్ల నిర్ధారణలోనూ ఈ సదుపాయం ఉపయోగపడనుంది. రోగి జన్యు లక్షణాలను ఆధారంగా చేసుకుని చికిత్సను రూపొందించే వ్యక్తిగతీకరించిన వైద్యం, ప్రెసిషన్ ఆంకాలజీ విధానాలకు ఎన్‌జీఎస్ కీలకంగా ఉపయోగపడుతుంది అని అన్నారు.యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీలో మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ నిపుణుల బృందంతో పాటు రోబోటిక్ ఆంకోసర్జరీ, ఎంఆర్‌ఐ–లినాక్ రేడియేషన్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్-హౌస్ ఎన్‌జీఎస్ ప్రారంభంతో క్యాన్సర్ రోగులకు నిర్ధారణ నుంచి చికిత్స వరకు మరింత సమగ్రంగా, రోగి-కేంద్రిత సేవలు అందించే దిశగా మరో ముందడుగు వేసింది.ఈ విలేకరుల సమావేశంలో మేనజర్ రాజేందర్, కంది శ్రీనివాస్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.