BREAKING
జీ20 ఇంధన సమృద్ధి సమావేశం అర్జెంటీనాలో వింత దృశ్యం.. రాత్రికి రాత్రే కిలోమీటర్ల కొద్దీ వెనక్కి తగ్గిన సముద్రం.. బయటపడ్డ పురాతన రాతి నిర్మాణాలు భారత్ మండపంలో 37 భారతీయ డీప్-టెక్ స్టార్టప్‌ల ప్రదర్శన డిడి ఇండియా 'ది ఎకనామిక్ బ్రీఫ్' ఆచార్య వినోబా భావే 'జై జగత్' పిలుపు మానవత్వాన్ని ఉన్నతంగా నిలిపింది ఉమ్మడి పురోగతికి భారత్, ఇరాన్ కృషి: విదేశాంగ శాఖ ప్రకటన న్యూఢిల్లీకి చేరుకున్న నైజీరియా ఉపాధ్యక్షుడు కాశీమ్ షెట్టిమా థియేటర్లలోకి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’.. తొలి రివ్యూలు ఎలా ఉన్నాయంటే! ఢిల్లీకి చేరుకున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ భారత్ మండపంలో బ్రిక్స్ భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్‌పోజిషన్ ప్రారంభం ఉరుగ్వే విదేశాంగ మంత్రితో ఎస్.జైశంకర్ భేటీ రష్యా ఉప ప్రధానితో నిర్మలా సీతారామన్ భేటీ టాలీవుడ్‌లోకి బాలీవుడ్ సంచలన చిత్రం.. తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల తేదీ ఖరారు! భారతదేశంలో 80 లక్షల మార్కును దాటిన హెచ్‌పివి వ్యాక్సినేషన్లు బ్రెజిల్ విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ

ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు.. గాంధేయ ఆశయాల సాధనకు సర్వోదయ మండలి పిలుపు

Select Suryaa Now
ఏపీ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు.. గాంధేయ ఆశయాల సాధనకు సర్వోదయ మండలి పిలుపు

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి, గాంధేయ అహింసా సిద్ధాంతానికి నిలువెత్తు ప్రతిరూపం, చారిత్రక భూదానోద్యమ ప్రణీత, భారతరత్న ఆచార్య వినోబా భావే నూట ముప్పై ఒకటవ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలలో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింసలతో పాటు వినోబా భావే ప్రబోధించిన సర్వోదయ సిద్ధాంతాలను నేటి సమాజానికి, భావితరాలకు చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు మరియు కర్నూలు నగరాల్లో సర్వోదయ మండలి ప్రతినిధులు ప్రత్యేక సర్వమత ప్రార్థనలు, శాంతి యాత్రలు మరియు విచార గోష్టులను ఏర్పాటు చేశారు. పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వినోబా భావే జీవిత విశేషాలు, ఆయన నడిపిన చారిత్రాత్మక భూదానోద్యమంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. 1951లో నాటి నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం నుంచి వినోబా ప్రారంభించిన భూదానోద్యమం ప్రపంచ చరిత్రలోనే అత్యంత శాంతియుతమైన ఘట్టమని వక్తలు కొనియాడారు. ఎటువంటి రక్తపాతం, చట్టపరమైన ఒత్తిళ్లు లేకుండా కేవలం హృదయ పరివర్తన ద్వారా లక్షలాది ఎకరాల భూమిని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేసిన మహోన్నత మానవతావాది వినోబా భావే అని స్మరించుకున్నారు.

ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే మరియు భారతరత్న పురస్కారాల గ్రహీత అయిన వినోబా భావే ఆశయాలను స్మరించుకోవడమే కాకుండా, ఆయన అందించిన విశ్వకల్యాణ నినాదమైన జై జగత్ భావనను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షులు నీలం రాంబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్, రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ భాస్కర్, సర్వోదయ మండలి ఉపాధ్యక్షులు వి. లత, కార్యనిర్వాహక కార్యదర్శులు జి. రవికుమార్, కె. ప్రదీప్ దాస్, మీడియా కార్యదర్శులు రాజేంద్రప్రసాద్, కోటి బాబు, యువజన విభాగం కన్వీనర్ అబ్దుల్ అమీర్ ఖాన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం శ్రీనివాస్, కృష్ణా జిల్లా అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొని వినోబా భావే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.