గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు
01 సూర్య గంగాధర:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామ పరిధిలో నిన్న ఒక గుర్తు తెలియని పురుషుడి మృతదేహం గుర్తించబడింది. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేయబడింది.మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, మృతుడి వివరాలు మరియు ఆచూకీపై విచారణ చేపట్టారు. మృతుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.మృతుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు లేదా తమ కుటుంబ సభ్యులు/బంధువులు ఎవరైనా కనిపించకుండా ఉన్నట్లయితే గంగాధర పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.సమాచారం తెలిసిన వారు గంగాధర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మొబైల్ నెంబర్ 8712670768 తెలియజేయగలరు.