BREAKING
టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు. అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా వినాయక చవితి వేడుకలు: పూజా సమయం మరియు ముహూర్త విశేషాలు బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా.. బిఆర్ఎస్ సదస్సుకు వేదికైన భారత మండపం ప్రత్యేకతలు ఇవే! సూర్యాపేటకు సుభిక్షం.. వరుణ యాగం*..మార్కెట్ చైర్మన్ కొప్పుల యష్ 'టాక్సిక్' సినిమాపై ఊహించని పరిణామాలు.. వారానికే థియేటర్ల నుంచి తొలగింపు! రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ ‘స్పిరిట్’ సినిమా తర్వాతే అసలు విజయం.. నిర్మాత సవాల్ హైదరాబాద్‌లో హైడ్రా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్.. 1070 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ బ్రిక్స్ సమ్మిట్ వేదికగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై దేశాల వ్యూహాత్మక మంతనాలు మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ

Select Suryaa Now
రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ

వినాయక చవితి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు*..

30 మందికి పైగా బైండోవర్*..

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు*..

పట్టణ సీఐ వెంకటయ్య*..

సూర్యాపేట : వినాయక చవితి పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు, సమస్యాత్మక వ్యక్తులకు ముందస్తు కౌన్సిలింగ్ నిర్వహించారు.పండుగ వేడుకల సందర్భంగా ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ వెంకటయ్య హెచ్చరించారు. వినాయక మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సమయంలో ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.పట్టణంలో పాత నేర చరిత్ర కలిగిన, రౌడీ షీటర్లుగా నమోదైన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న సుమారు 30 మందికి పైగా వ్యక్తులపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఎలాంటి అనుమానాస్పద ఘటనలు లేదా గొడవలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ వెంకటయ్య కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు అజయ్, సందీప్ రెడ్డి, కనకరత్నం, పోలీసు సిబ్బంది శ్రీరాములు, రామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.