సూర్యాపేటకు సుభిక్షం.. వరుణ యాగం*..మార్కెట్ చైర్మన్ కొప్పుల
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి*..
సూర్యాపేట
సూర్యాపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం నిర్వహించిన వరుణ యాగం మహోత్సవంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు.
వరుణ యాగం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని కొప్పుల వేణారెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ, నిర్వాహకులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.