ఉద్యోగులకు రెండు డి ఏ లు విడుదల చేయడం పట్ల ఎన్జీవో సంగం నేతలు హర్షం పట్ల
*ఉద్యోగులకు రెండు డిఎలు విడుదల చేయడం పట్ల ఎన్జీఓ నేతల హర్షం*
పులివెందుల మేజర్ న్యూస్:
ఈ నెల 5వ తేదీన ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలలో ఇచ్చిన హామీ ప్రకారం,రెండు విడతల డిఎలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల పులివెందుల తాలూకా యూనిట్ సహా అధ్యక్షులు సుకుమార్, ఉద్యోగ ప్రతినిధి నరేష్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు , గారు కి ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర జెఎసి చైర్మన్ శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారికి ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డి.వి. రమణ గారికి కడప జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బలపనూరు శ్రీనివాసులు, గారు కి జిల్లా కార్యదర్శి శ్రీ నిత్యపూజయ్య ,గారికి మరియు జిల్లా కార్యవర్గ సభ్యుల కు కృతజ్ఞతలు తెలిపారు. చర్చలలో హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగుల మిగిలిన డిమాండ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నెరవేర్చాలని సుకుమార్, నరేష్ కోరారు.