BREAKING
కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

పేద ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- సిపిఐ ప్రసాద్

Select Suryaa Now
పేద ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- సిపిఐ ప్రసాద్

అమ్మ ఒడి పింఛన్లలో మోసపూరితంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్

రాష్ట్రవ్యాప్తంగా ఒక కుటుంబ హౌసింగ్ మ్యాప్ లో మరో కుటుంబ సభ్యులు యాడ్ కావడం వలన వారికి కరెంటు బిల్లులు పర్సెంటేజ్ ప్రకారం సంవత్సరానికి 300 యూనిట్లు దాటడం వలన పేద ప్రజలు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకపోవడం వలన అనేక బాధలు పడుతున్నారు
     రాష్ట్ర ప్రభుత్వం ముందు హౌసింగ్ మ్యాప్ లో యాడ్ అయిన రెండు మూడు కుటుంబాలను వేరు చేసే విధంగా ఆప్షన్ విడుదల చేసి న తరువాత అమ్మ ఒడి. పింఛన్లు విడుదల చేసి ఉంటే పేద ప్రజల మన్నలను పొందేవారు 
    రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా ఖాళీ కాకుండా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశామని చెప్పుకోవడానికి ఈ రకంగా మోసం చేస్తున్నారు
    ఇది ప్రజలు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారు
   నంద్యాల పట్టణం లో ఇటువంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసి పోతున్నారు మున్సిపల్ అధికారులు మీరు చెప్పేటివి వాస్తవమే కానీ వాటిని తొలగించే దానికి ఆప్షన్ ప్రభుత్వం విడుదల చేయలేదు మేము ఏమి చేయాలని చేతులు ఎత్తేస్తున్నారు 
    రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కల్లా హౌసింగ్ మ్యాపులో యాడ్ అయిన రెండు మూడు కుటుంబాల వారిని తొలగించి ఒకే కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు ఉండే విధంగా హౌసింగ్ మ్యాపును విడుదల చేయని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అటువంటి బాధితులను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు