BREAKING
కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు

Select Suryaa Now
తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు

తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు.... వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.....

పెండ్లిమర్రి, మేజర్ న్యూస్... 

ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వ్యాఖ్యాత, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక రచయిత అయినటువంటి డాక్టర్ ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు కు ఈనెల 15 నుండి 23 వరకు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలపై ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయుటకు టీటీడీ అధికారుల ఆహ్వానం అందుకున్నారు.. ఈనెల 15వ తేదీ రాత్రి జరిగే పెద్ద శేష వాహన సేవ, 16వ తేదీ ఉదయం జరిగే చిన్న శేష వాహన సేవలకు తిరుమల మాడవీధులలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పక్షాన వ్యాఖ్యానం చేయనున్నారు... అలాగే ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం జరిగే  రాత్రి జరిగే చంద్రప్రభ వాహన సేవలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీవీలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయనున్నారు.

42 ఆధ్యాత్మిక గ్రంథాలను 12 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చరిత్ర పాఠ్యపుస్తకాలు రచించారు. వేలాది వ్యాసాలు వివిధ పత్రికల్లో రాసిన ఆయన తిరుమల తిరుపతి తిరుచానూరు శ్రీశైలం ఒంటిమిట్ట క్షేత్రాలలో వివిధ ఉత్సవాల సమయంలో ప్రవచనాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేయడంతో పాటు వివిధ వాహన సేవలు, కల్యాణోత్సవం వంటి సేవలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. వీరికి శ్రీశైలం నుంచి ఆహ్వానం రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కడప సాహితీవేత్తలు అభినందనలు తెలపడం విశేషం...