మోడీ,చంద్రబాబు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి-పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి.రఫీ
చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలి.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి.
పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి.రఫీ
నంద్యాల నూనెపల్లె: ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థి లోకం సమరశీలంగా ఉద్యమించాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ పిలుపునిచ్చారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) నంద్యాల పట్టణంలో సమావేశం శనివారం సాయి బాబా నగర్ నగర్ లో ఉన్న పి డి ఎస్ యు కార్యాలయంలో షైక్ షాహీద్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-2020 పేరుతొ విద్యారంగాన్ని కాషాయికరణ, కార్పొరేటికరణ, కేంద్రికరణ చేస్తుందని విమర్శించారు. విద్యారంగాన్ని మనువాద భావాజాలాంతో నింపడానికి పూనుకుంటుందని అన్నారు. యూనివర్సిటీలకు నిధుల కోత విధిస్తూ సంక్షోభంలో పెడుతుందని అన్నారు. యూనివర్సిటీలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. కొఠారీ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో 135 పేపర్లు లేకేజి కావడం దుర్మార్గమని అన్నారు. 2026 నీట్ ప్ర స్నాపత్రం లేకేజి కారణంగా 10 మందికి పైగా విద్యార్థులు బలై పోయారని అన్నారు. నీట్ లేకేజీపై, విద్యారంగ సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ, లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించిన ఫలితంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసాడని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని విమర్శించారు. రాష్ట్రంలో 6450 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిలను విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. యువగళం పాద యాత్రలో మంత్రి లోకేష్ 77 జిఓను రద్దు చేస్తామని ఇచ్చిన హామిని రెండున్నర సంవత్సరాలైనా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. Sc, St, Bc సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచకుండా ఈ వర్గాల విద్యార్థుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతుందని అన్నారు. సంక్షేమ హాస్టల్సలో సమస్యలు తిష్ట వేసి ఉంటే సమస్యలను పరిష్కరించకుండా, హాస్టల్స్ లోకి విద్యార్థి సంఘాలను రాకుండా జిఓ తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే ఈ జిఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం వంటి కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్, వార్డెన్, మేట్రిన్, టీచింగ్ - నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.
ఈ సమావేశంలో పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షులు షాహీద్, జిల్లా నాయకులు కాంత్, ధను,నవీన్, కుమార్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.