BREAKING
రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం.. కూటమి పడుతున్న కుయుక్తులను తిప్పి కొడతాం.. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని లె మిన్ హంగ్ భేటీ ఢిల్లీకి చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తిరుమల బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా ఐ ఎల్ ఎన్ చంద్రశేఖర రావు మోడీ,చంద్రబాబు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి-పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి.రఫీ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేశ విగ్రహాలనే వినియోగించాలి- కలెక్టర్ రాజకుమారి గణియా పేద ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- సిపిఐ ప్రసాద్ తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని వెంటనే నిర్మించాలి -కడెం లింగయ్య

కోడిపందేలకు వెళ్లి భయంతో పరుగులు... గుండెపోటుతో వ్యక్తి మృతి

Select Suryaa Now
కోడిపందేలకు వెళ్లి భయంతో పరుగులు... గుండెపోటుతో వ్యక్తి మృతి

కోడిపందేలకు వెళ్లి భయంతో పరుగులు... గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇంకా ఆగని కోడిపందాలు.. కొనసాగుతున్న అక్రమ పందేలు

దెందులూరు: దెందులూరులో మంగళవారం రాత్రి జరిగిన కోడిపందాల వద్ద డ్రోన్ లైటింగ్ కనిపించడంతో భయపడిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీసిన ఘటన విషాదానికి దారితీసింది. తీవ్రంగా పరుగెత్తడంతో ఆయాసానికి గురైన ఆ వ్యక్తి అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.

స్థానికుల సమాచారం ప్రకారం... కోడిపందాలు జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్ లైటింగ్ కనిపించడంతో పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయన్న భయంతో పలువురు అక్కడి నుంచి పరుగులు తీశారు. వారిలో ఓ వ్యక్తి తీవ్రంగా పరుగెత్తడంతో ఆయాసానికి గురయ్యాడు. అనంతరం సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ మరుసటి రోజు కూడా ఆయాసం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో ఈసీజీ పరీక్ష నిర్వహించిన అనంతరం చికిత్స అందిస్తూ సెలైన్ ఎక్కిస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. గుండెపోటుతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, మృతికి సంబంధించిన పూర్తి వైద్య కారణాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

ఆగని కోడిపందాలు

ఒకవైపు కోడిపందాల నిర్వహణపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, మరోవైపు దెందులూరు పరిసర ప్రాంతాల్లో కోడిపందాలు కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న పందాలను అరికట్టాలని ప్రజలు పోలీసు అధికారులను కోరుతున్నారు.