BREAKING
టీడీపీ కార్యకర్త నెట్టెం కేశవ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్ రాప్తాడు వైసీపీలో ముసలం.. తోపుదుర్తిపై తిరుగుబాటు! పామెనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి పెడన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు: ఉపయోగంలోకి రాని మరుగుదొడ్లు.. అధికారుల నిర్లక్ష్యంపై జేఏసీ ఆగ్రహం భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం జాగ్రత్తలు పాటిస్తూ వినాయక చవితి జరుపుకోండి: ఖాజీపేట సీఐ వంశీధర్ ఆగస్టు 2026లో భారతీయ రైల్వే రికార్డు పురోగతి అనుమానస్పద మృతి గ్లోబల్ సౌత్‌కు గ్లోబల్ డిసిషన్లలో చోటుండాలి బ్రిక్స్ సమగ్ర వికాసానికి నాలుగు మూలస్తంభాలు నిరాడబరంగా బార్మీ జరుపుకోవాలని బ్రిక్స్ బహిరంగ సమావేశానికి ముందు భారత్ మండపంలో ప్రపంచ నాయకులకు ప్రధాని మోదీ సాదర స్వాగతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం

 ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే
ఉప్పల్ మండే మార్కెట్‌లో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా ఆటో యూనియన్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆటో యూనియన్ అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి మరియు ఆటో యూనియన్ సభ్యులు  ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి  ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గుడి మధుసూదన్ రెడ్డిని  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అభినందించారు మరియు నిర్వాహకులు, ఆటో యూనియన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, ఆటో యూనియన్ సభ్యులు,స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
ఈరెల్లి రవీందర్ రెడ్డి శనిగరం తిరుమలేష్ జట్ట కిషోర్, శ్రీనివాస్ రెడ్డి సుక్క కిరణ్ తదితరులు పాల్గొన్నారు