andhrapradesh
బుడమేరు ఆక్రమణలపై ప్రభుత్వానికి ఊరట
విజయవాడలోని బుడమేరు పరీవాహక ప్రాంతంలో గల ఆక్రమణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుడమేరు పరిధిలోని అన్ని రకాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా, కొత్తగా చేపట్టే అక్రమ నిర్మాణాలకు నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కనెక్షన్లు మంజూరు చేయవద్దని స్పష్టం చేసింది.
గతంలో బుడమేరు వరదల కారణంగా విజయవాడ నగరం తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆక్రమణల వల్లే ఈ విపత్తు తలెత్తిందని గుర్తించిన ప్రభుత్వం, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అయితే, కొందరు ఆక్రమణదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ప్రక్రియకు కొంత ఆటంకం ఏర్పడింది.
తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, బుడమేరు ఆక్రమణలపై నిరంతరం నిఘా ఉంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ కొత్తగా అక్రమ నిర్మాణాలకు తావు ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.