BREAKING
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే లండన్ వేదికగా మెరిసిన సీఎం విజయ్: తమిళనాడుకు రూ. 11,000 కోట్ల భారీ పెట్టుబడులు మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా? PSGకి ఈ సీజన్‌లో తొలి విజయం ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం బ్రిక్స్ ప్రకటనపై ఉరుగ్వే ప్రశంసలు పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నిఘంటువు ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్ బ్రిక్స్ విజయం భారత్ ప్రపంచ నాయకత్వానికి నిదర్శనం: సీఎం యోగి

ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి

Select Suryaa Now
ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి

 

ధర్మవరం:

అనంతపూర్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, పుట్టపర్తి జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు ధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో A4 మద్యం దుకాణాల లైసెన్స్‌దారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ N. చంద్రమణి మాట్లాడుతూ.. ఓపెన్, రిజర్వేషన్ కేటగిరీల కింద మద్యం దుకాణాల రెన్యూవల్ ఫీజులు, చెల్లించాల్సిన వివరాలపై లైసెన్స్‌దారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత రుసుమును ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు. సకాలంలో ఫీజు చెల్లించని వారి లైసెన్సులను రద్దు చేస్తామని, ఆ షాపుల స్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి నూతన మద్యం షాపుల టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎస్సైలు చాంద్ బాషా, నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మరియు మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు పాల్గొన్నారు.