BREAKING
కొబ్బరి పీచుతో గ్రామీణ మహిళల సాధికారత ఢిల్లీలో రూ. 13,800 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం నేపాల్‌కు విద్యుత్ ఎగుమతికి భారత ప్రభుత్వం ఆమోదం సెప్టెంబర్ 17న ‘సెమికాన్ ఇండియా 2026’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ హ్యూస్టన్‌లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ పర్యటన హిందీ, భారతీయ భాషలే జాతీయ ఐక్యతకు సాధనాలు: అమిత్ షా ప్రధాని మోదీ పుట్టినరోజున 'ఆశీర్వాద దీపం' వెలిగించాలి భారతదేశంలో తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి బీహార్‌లోని 17 జిల్లాలకు వాతావరణ హెచ్చరిక భారత ఆర్థిక రంగానికి చోదక శక్తిగా డేటా సెంటర్లు అనంతపురంలో చిరుతల బీభత్సం: టమాటా తోటలో 7 జింకల మృతి! ‘హిందీ దివస్’ వేడుకలు 'వాణిజ్య బొగ్గు గనుల వేలం' తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథి: ఇన్‌చార్జ్ రేసులో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్! మట్టి గణపయ్యకు తొలి పూజ చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బి ఎస్ ఆర్ )

అనంతపురంలో చిరుతల బీభత్సం: టమాటా తోటలో 7 జింకల మృతి!

Select Suryaa Now
అనంతపురంలో చిరుతల బీభత్సం: టమాటా తోటలో 7 జింకల మృతి!

 అనంతపురం జిల్లా తాటిచర్లలో చిరుతల దాడిలో ఏడు జింకలు మృతి చెందాయి. పొలం చుట్టూ ఉన్న కంచె కారణంగా జింకలు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
అనంతపురం రూరల్ మండలం తాటిచర్ల గ్రామంలో చిరుతపులుల దాడి కలకలం రేపింది. స్థానిక రైతు నరసింహారెడ్డి తన టమాటా తోట చుట్టూ వన్యమృగాల రక్షణ కోసం కంచె ఏర్పాటు చేశారు. సమీప అడవి నుంచి పంట మేసేందుకు వచ్చిన ఏడు జింకల మందను వెంబడిస్తూ రెండు చిరుతలు తోటలోకి ప్రవేశించాయి.
ప్రాణభయంతో తప్పించుకునేందుకు యత్నించిన జింకలు, పంట కంచె అడ్డుగా ఉండటంతో బయటకు వెళ్లలేకపోయాయి. దీంతో చిరుతలు దాడి చేసి ఏడు జింకలనూ హతమార్చాయి. ఉదయం తోటకు వచ్చిన రైతు జింకల కళేబరాలను గమనించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. గ్రామ పరిసరాల్లో చిరుతల సంచారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని, వెంటనే వాటిని బంధించాలని తాటిచర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.