BREAKING
వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన.. ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026 ఏ సంక్షోభమూ ఒక ప్రాంతానికే పరిమితం కాదు ఐఎన్ఎస్ కులిష్‌కి కంబోడియాలో ఘన స్వాగతం తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు.. ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో అలా మొదలైంది' విడుదల.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక ప్రజలందరికి.. వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని కరుణతో ప్రజలకు సుఖసంతోషాలు ఎస్సై సూర్యనారాయణరెడ్డి..

ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

Select Suryaa Now
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

 

 సీఎం రేవంత్‌రెడ్డి

ఆత్మగౌరవ భవనంతో పేద ఆర్యవైశ్యులకు ప్రయోజనం కలగాలి

ఐక్యంగా ఉంటేనే బలం.. రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలి

  ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారని, ఆర్యవైశ్యుల్లో చాలామంది పేదలు ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కోసం తమను పేదలుగా గుర్తింపు పొందేందుకు ఇష్టపడరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్, 13):
  ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల్లో చాలామంది పేదలు ఉన్నప్పటికీ ఆత్మాభిమానం కారణంగా తమను పేదలుగా గుర్తింపు పొందేందుకు ఇష్టపడరని, పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడేలా చూడాలని అన్నారు.
    ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌ నిర్మాణానికి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,.. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారని, కష్టాలు, బాధలు ఉన్నా సమాజంలో గౌరవం కోసం జీవించే స్వభావం వారిదని అన్నారు.

ప్రతి శుభకార్యంలో ఆర్యవైశ్యుల పాత్ర:
       గ్రామాల్లో ఎంత పేదవాడు కష్టాల్లో ఉన్నా కనీసం అవసరాలకు అప్పుగా సహాయం చేసేవారిలో ఆర్యవైశ్య సోదరులు ముందుంటారని సీఎం అన్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా మొదట గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని పేర్కొన్నారు.

        ప్రపంచంలో ప్రధానంగా వ్యవసాయం, వ్యాపారం అనే రెండు వృత్తులే ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యాపార రంగంలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి తదితరులు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించేవారని గుర్తుచేశారు.

      ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్‌ గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, నవీన్‌ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ గుప్త, మాజీ ఎంపీ మధు యాష్కీ తదితరులు హాజరయ్యారు.

రోశయ్యతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం:
       2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఆవిర్భవించడానికి ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య కారణమని రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో తాను దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను పిలిచి ఆవేశాన్ని తగ్గించుకుని, అనుభవంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి ఎదుగుతావని ఆశీర్వదించారని గుర్తుచేసుకున్నారు.

    తనను రాజకీయాల్లో ముందుగా గుర్తించింది రోశయ్యేనని సీఎం తెలిపారు. రోశయ్య ఎవరినీ విమర్శించేవారు కాదని, తిట్టేవారు కాదని, తనదైన శైలిలో చురకలు వేసేవారని అన్నారు.

         రోశయ్య గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. విగ్రహం ఏర్పాటుపై కొందరు విమర్శలు చేసినప్పటికీ, నాలుగు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చిన రోశయ్య, మంచైనా చెడైనా ఇక హైదరాబాద్‌ తనదేనని చెప్పిన మాటలను గౌరవించి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.

మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం:
       ఆర్యవైశ్యులను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారని సీఎం తెలిపారు. ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ ఆర్యవైశ్య సమాజానికి చెందిన బిడ్డగా దేశానికి గర్వకారణమని అన్నారు.

       ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వారు ఉండరని, భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన మహాత్మా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిగా ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

       పొట్టి శ్రీరాములు పోరాట ఫలితంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని సీఎం అన్నారు. దేశ సమగ్రత కోసం మహాత్మా గాంధీ ప్రాణత్యాగం చేస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు.

రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలి:
        ఆర్యవైశ్యులకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు ఇంకా రాలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల పిల్లలకు ఆత్మగౌరవ భవనం పూర్తిస్థాయిలో ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

       భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులంతా కలిసి ఉంటేనే బలం చేకూరుతుందని, సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తేనే అందరూ గౌరవిస్తారని అన్నారు.

           ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్‌ పదవి ఇచ్చామని, కొడంగల్‌లోని ఒక మున్సిపాలిటీలో ఆర్యవైశ్య వర్గానికి చెందిన వ్యక్తికి చైర్మన్‌ పదవి ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటాను తామే తీసుకోవాలని, ఐక్యంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

         ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్, ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మందముల పరమేశ్వర్‌ రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బెలిదే రమేష్‌ గుప్తతో పాటు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.