BREAKING
వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన.. ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026 ఏ సంక్షోభమూ ఒక ప్రాంతానికే పరిమితం కాదు ఐఎన్ఎస్ కులిష్‌కి కంబోడియాలో ఘన స్వాగతం తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు.. ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో అలా మొదలైంది' విడుదల.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక ప్రజలందరికి.. వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని కరుణతో ప్రజలకు సుఖసంతోషాలు ఎస్సై సూర్యనారాయణరెడ్డి..

తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు.. ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు

Select Suryaa Now
తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు.. ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు

 

ధర్మవరం, సెప్టెంబర్ 13:

సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం తుంపర్తి గ్రామంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి.

గత నెల సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామంలో ప్రత్యేక వేదికను నిర్మించి స్వామివారి ప్రతిమను కొలువుదీర్చారు. పది రోజుల పాటు రోజూ ఉదయం, సాయంత్రం జ్ఞానరీత్యా నిత్యపూజలు, భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 13) మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణ ప్రతిమ పురవీధులలో ఊరేగింపు కార్యక్రమం కన్నులపండువగా సాగింది. దేవుడే మనిషిగా జన్మించి జ్ఞాన, అజ్ఞానాలకు వారథిగా నిలిచిన శ్రీకృష్ణుడి విశిష్టతను గ్రామస్తులకు ఎరుకపరచడానికే ఈ ఊరేగింపు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక తుంపర్తి కమిటీ అధ్యక్షుడు కే. అప్పిరెడ్డి, సభ్యులు శివారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, యోగానందరెడ్డి, అశోక్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, గోవిందు, రామ్మోహన్‌రెడ్డి, కాంతమ్మ, శ్రీలత, వరలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.