BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

పూలను దైవాలుగా కొలిచే పండుగ బతుకమ్మ … జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Select Suryaa Now
పూలను దైవాలుగా కొలిచే పండుగ బతుకమ్మ … జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు సంగారెడ్డి  కలెక్టరేట్ ప్రాంగణంలో  గురువారం ఘనంగా నిర్వహించారు . వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలతో  కలెక్టరేట్‌ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ లలితాదేవి, ఉద్యానవన శాఖ అధికారి పి. సోమేశ్వర్‌రావు, టీజీవో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వైద్యనాథ్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొని గౌరీమాతకు, బతుకమ్మలకు పూజలు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్ .. మహిళలను శక్తి స్వరూపిణులుగా గౌరవించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమని అన్నారు .పూలను దైవాలుగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు,  సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  తీరొక్క రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను చేతబూని మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బతుకమ్మల చుట్టూ సంప్రదాయబద్ధంగా ఆడిపాడుతూ సందడి చేశారు. అనంతరం గౌరీమాతకు, బతుకమ్మలకు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో ఏటా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని  అధికారులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో   వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖల   అధికారులు,  మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, కలెక్టరేట్‌ సమీపంలోని కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .