BREAKING
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - ప్రిన్సిపాల్ తోట గాంధీ ఏయూ హెల్త్ సెంటర్‌కు రూ 2.84 లక్షల విలువైన వైద్య పరికరాల విరాళం గూడూరులో ఘనంగా చే గువేరా వర్ధంతి మామిడిపల్లిలో బాలాజీ ఆలయంలో పూజా సామాగ్రి వేలంపాట కేసీఆర్ పాలన స్వర్ణయుగం కాంగ్రెస్ పాలన రాతియుగం - ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నాణ్యతతోనే సుస్థిర ప్రగతి, స్వయం సమృద్ధి : ఉక్కునగరంలో ఘనంగా ముగిసిన ‘సీసీక్యూసీ-2026’ సదస్సు డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు సుజాతనగర్ రోడ్డు పనులపై స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు! పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం – అదనపు కలెక్టర్ విక్టర్ రాజకీయాల్లోకి నా కుటుంబాన్ని లాగొద్దు.. జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచే పోటీ ​రక్తదానమే అసలైన నివాళి నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి - కలెక్టర్ రాజర్షి షా ​ఉద్యోగులకు పెనుముప్పుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025 ఏపీజీఈఏ నోముల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పూల సోయగాల నడుమ బతుకమ్మ సంబరాలు తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సందడి

Select Suryaa Now
పూల సోయగాల నడుమ బతుకమ్మ సంబరాలు తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సందడి
సూర్య తిర్యాణి : తిర్యాణి, తెలంగాణ  సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను తిర్యాణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొనడంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విద్యార్థినులు వివిధ రకాల పూలను సేకరించి, చక్కటి ఆకృతుల్లో బతుకమ్మలను పేర్చారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరై, బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ సందడి చేశారు. పూల సోయగాలు, విద్యార్థినుల ఆటపాటలతో కళాశాల ప్రాంగణం కళకళలాడింది. అధ్యాపకులు సైతం విద్యార్థినులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.ప్రకృతిని, పూలను ఆరాధించే బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటేలా సంబరాలు సాగాయి. చదువులతో నిత్యం సందడిగా ఉండే కళాశాల ప్రాంగణం బతుకమ్మ పాటలతో మార్మోగింది. విద్యార్థినులు సమష్టిగా పాల్గొని తెలంగాణ సంప్రదాయ వేడుకను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం లో విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు