పెంబి లో నూతన మీ సేవ కేంద్రం ప్రారంభం
సూర్య పెంబి:నిర్మల్ పెంబి మండల కేంద్రంలో "స్మైలిక సాయి" మీ సేవ కేంద్రం ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరుగింది. ఈ నూతన మీ సేవా కేంద్రాన్ని పెంబి తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్య నారాయణ స్వామి,నాయకులు సుతారి మహేందర్,సల్ల స్వప్నిల్ రెడ్డి, సల్ల నరేందర్ రెడ్డి,ఐదు వెంకటేష్, గ్రామ మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్,పుప్పాల శంకర్, గాండ్ల శంకర్, సుధాకర్ గౌడ్, తదితర అతిధులు పాల్గొన్నారు.
మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం..--మీ సేవ నిర్వాహకులు స్మైలిక సాయి: నిర్మల్ జిల్లాలోనే మారుమూల మండలం అయిన పెంబిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తాం. పెంబి మండల కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల గ్రామాల పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ నూతన మీ సేవా కేంద్రం ద్వారా నిత్యం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించుకొన్నాం.