BREAKING
పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యం ----సెవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్. ఎల్ వినో ప్రభావం--పశుపోషకులు జాగ్రత్త రేవంత్ రెడ్డి పాటకు ఆది శ్రీనివాస్ స్టెప్పులు విద్యార్థులకు చట్ట సభల నిర్వహణపై అవగాహన కల్గి ఉండాలి కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖుతుబోద్దీన్ పాషా రైతుల సంక్షేమమే మోమిన్‌పేట్ పీఏసీఎస్ లక్ష్యం యూ అండ్‌ ఏ సర్టిఫికేట్ పూర్తి చేసుకున్న చకోర సినిమా.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ పుంగనూరులో రైతు బజార్ ప్రారంభించిన మధుసూదన్ నాయుడు! శాంతినగర్‌లో ఘనంగా 'అంగన్‌వాడీ ఉత్సవం'.. కార్యకర్తలకు సన్మానం, పోషణ్ సామాగ్రి పంపిణీ తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయం: నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబువడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చొరవతో సిసి రోడ్డు ఉప్పల చిలక యుపిఎస్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తత్వం సినిమాలోని ఉత్కంఠ ప్రతి ఒక్కరికీ అద్భుతమైన థ్రిల్‌ను పంచుతుంది.. దర్శకుడు అర్జున్ కోలా ఇంటర్వ్యూ సీఎం పర్యటనకు ముందు భద్రతా రిహార్సల్స్‌ సాధారణమే: అధికారులు జిల్లా పరిషత్ చైర్మెన్ గా గంధం నేతాజీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

పర్యటనలపై ఉన్న శ్రద్ధ హామీలు నెరవేర్చడం పై ఉంచాలి – వెన్నమనేని శ్రీధర్ రావు

Select Suryaa Now
పర్యటనలపై ఉన్న శ్రద్ధ హామీలు నెరవేర్చడం పై ఉంచాలి  – వెన్నమనేని శ్రీధర్ రావు

సూర్య తంగళ్ళపల్లి:సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలపై ఉన్న శ్రద్ధ హామీలు నెరవేర్చడం పై ఉంచాలని బిజెపి తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి నాయకులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.. ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్లకు వస్తున్నాడన్నారు. నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు. అసెంబ్లీలో సీఎం సిరిసిల్ల జిల్లాలో 8 వేల ఎకరాల కబ్జా జరిగిందని చెప్పాడని ఆ కబ్జా భూమిని రికవరీ చేసి పేదలకు పంచాలన్నారు. గత ప్రభుత్వం 9 సంవత్సరాలు పాలించి సిరిసిల్ల నేతన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్న వారిని పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్మికులకు నెలవారి వేతనం రూ 18 వేలు ఇవ్వాలన్నారు. మిడ్ మానేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది మిడ్ మానేరు ప్రతి నిర్వాసిత కుటుంబానికి రూ 5,04000 ఇస్తానన్న హామీ నెరవేర్చాలన్నారు. అలాగే  మిడ్ మానేరు నిర్వాసితులకు ఉపాధి కల్పించాలన్నారు. వెంటనే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంచె శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యుడు జిందం సంతోష్, బిజెపి నాయకులు కంకణాల రమేష్, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.