BREAKING
హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం

Select Suryaa Now
రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం

హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల విలువైన విలువైన భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని, దానిని ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా అప్పగిస్తున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ఆయన రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఆర్టీసీ బస్ భవన్ ఎదురుగా ఉన్న ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (ప్లాట్ నం.1)లో 3.5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం గజం రూ.2 లక్షలు (మొత్తం రూ.500 కోట్లు) ఉంటుందని హరీష్ రావు తెలిపారు. అయితే, పరిశ్రమల శాఖ ఈ భూమిని గజం కేవలం రూ.56 వేల చొప్పున మొత్తం రూ.87 కోట్లకే ప్రైవేటు పరం చేయడానికి నిర్ణయించడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కూడా సమాచారం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సొంత ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్ ఆ స్థలానికి రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని పక్కనపెట్టి మరీ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టడం వెనుక ఉన్న అసలు మర్మమేంటని ప్రశ్నించారు.

వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆయిల్‌ఫెడ్ భూమిని ఆ సంస్థకే కేటాయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బిఆర్‌ఎస్ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.