BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు

Select Suryaa Now
శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ ప్రతినిధి ….కరీంనగర్‌ను అభివృద్ధిలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 45వ డివిజన్ మంకమ్మతోటలో రూ.70 లక్షల యూఐడీఎఫ్ నిధులతో డ్రెయిన్ పైప్‌లైన్, సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరంలో రూ.630 కోట్లతో మోడల్ రోడ్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్, జంక్షన్ల అభివృద్ధి చేపడతామన్నారు. రూ.130 కోట్లతో 80 కి.మీ. మేర స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, రూ.80 కోట్లతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు, 130 ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.