BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం

Select Suryaa Now
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ సచివాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం మరియు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం, పలు ప్రముఖ ప్రైవేట్ సంస్థల మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం తోడైతేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ నిధుల ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి ప్రధాన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ఒప్పందం ఎంతో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.