BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం

Select Suryaa Now
నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం

రేవంత్ రెడ్డి అసమర్థతకు ఇది నిదర్శనం!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరు నత్త కూడా సిగ్గుపడేలా ఉందంటూ సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూసీ నదిపై ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణాన్నే ఏళ్ల తరబడి సాగదీస్తూ ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

సెప్టెంబర్ 2023లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై రెండు వైపులా కలిపి ఆరు లేన్ల నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే, తాజాగా (ఆగస్టు 30, 2026 నాటికి) కేవలం ఒకవైపు ఉన్న మూడు లేన్ల బ్రిడ్జి నిర్మాణం మాత్రమే పూర్తయింది. అంటే మూడేళ్ల సుదీర్ఘ కాలంలో రేవంత్ ప్రభుత్వం కేవలం సగం బ్రిడ్జిని మాత్రమే పూర్తి చేయగలిగింది.

తెలంగాణకు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పాలనా అసమర్థతకు ఈ సగం పూర్తయిన బ్రిడ్జియే ప్రత్యక్ష సాక్ష్యమని విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు. మూసీ నదిపై ఒక చిన్న బ్రిడ్జిలోని సగభాగాన్ని నిర్మించడానికే మూడేళ్ల సమయం తీసుకున్న ఈ ప్రభుత్వం, ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో మూసీ నదిని మొత్తం సుందరీకరిస్తామని చెబుతున్న మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.