BREAKING
నిరంతర విద్యుత్ సరఫరా నవ శఖానికి నాంది. అన్ని కులాల్లోని నిరుపేదలకూ రిజర్వేషన్లు దక్కాలి:కీసర వేదికగా 'సాధన కమిటీ' నాయకుల పిలుపు ఓపెన్ స్కూల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ నెల 22 నుంచి నవంబర్ 4 వరకు ఇంటింటి సర్వే.. బీసీలకు రాజకీయ ప్రోత్సాహం టీడీపీతోనే సాధ్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రామతీర్థంలో ఘనంగా శ్రీరామచంద్రస్వామి పవిత్రోత్సవాల ముగింపు.. డిజిటల్ లావాదేవీలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. 80 గ్రామాలు టీబీ ముక్త్‌గా ఎంపిక కావడం అభినందనీయం టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీరాములు డీజిల్ ఉద్గారాల కేసులో కార్ల కంపెనీలకు బిగ్ రిలీఫ్ ​దన్నాదపేటలో ఘనంగా పోషణ మాసోత్సవాల ముగింపు * గర్భిణులకు పోషకాహారంపై అవగాహన మహిళలేప్రాధాన్యతగా సంక్షేమ పథకాలు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొత్త ఎరువులు పంపిణీ విధానం పై శిక్షణ. దసరా సెలవుల అనంతరం బకాయిలు చెల్లించకపోతే హాస్టల్ నిర్వహణ కష్టమే భూగోళ పరిరక్షణే మానవాళికి అసలైన మనుగడ

నేదునూరులో భూభారతి భూసర్వే రీ -సర్వే పై గ్రామసభ

Select Suryaa Now
నేదునూరులో  భూభారతి భూసర్వే రీ -సర్వే పై గ్రామసభ

నేదునూరులో భూభారతి భూసర్వే, రీ-సర్వేపై గ్రామసభ

కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం గ్రామ సర్పంచ్ కాసుల స్వాతి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా భూభారతి భూసర్వే, రీ-సర్వే కార్యక్రమంపై డిప్యూటీ తహసిల్దార్ శేఖర్ రైతులకు అవగాహన కల్పించారు. గ్రామంలో అక్బర్జా రెవెన్యూ పరిధిలోని భూములకు సరిహద్దులు, కొలతలు నిర్ణయించి పట్టా భూములు, అసైన్డ్ భూములు, పాఠశాల పరిధిలోని భూములు, హౌసింగ్ భూములను గుర్తించి విభజించనున్నట్లు తెలిపారు. అనంతరం సంబంధిత భూములను రైతులకు కబ్జా చూపించే ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. సర్వేకు సంబంధించి నోటీసులు అందుకున్న రైతులందరూ నిర్ణీత సమయంలో హాజరై అధికారులకు సహకరించాలని సూచించారు.కార్యక్రమంలో  డీఐ రమాకాంత్‌రెడ్డి, ఆర్‌ఐ శ్రీకాంత్, మండల సర్వేయర్ సాయికాంత్, ఉపసర్పంచ్ నల్లి శ్రీధర్ ముదిరాజ్, సభ్యులు  పుణ్యమూర్తి శ్యామల, పడమటి మహిపాల్ రెడ్డి, పడమటి హారిక, కళ్యాణ్ కార్ వరుణ్, నీరటి అనిత, అంకగళ్ల కార్తికేయన్, వంగూరు యాదమ్మ, ఎనుముల ప్రవీణ్, వరికుప్పల బాబు, మాజీ ఉప సర్పంచ్ బుడ్డీరపు శ్రీనివాస్ నాయకులు ఎగిరిశెట్టి శంకర్, మిద్దె గణేష్, యారం బాల్రెడ్డి పోలేమోని నాగేష్, నీరటి వెంకటేష్, జి పి వో లు నాగరాజు, శ్రీనివాస్ పంచాయతీ సెక్రెటరీ రాఘవేందర్, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


-టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు