BREAKING
సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు భూపేన్ హజారికా 100వ జయంతి జర్మనీలో అతివాద ఏఎఫ్‌డీ గెలుపు శ్రీధర్‌బాబు ఫైర్.. స్పీకర్‌ను బెదిరిస్తున్నారు 2019 నుండి వ్యవసాయ, అనుబంధ రంగాలకు అరుణాచల్ ప్రాధాన్యత అయోధ్యలో నేడు అంగన్‌వాడీ కార్యకర్తలను సత్కరించనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐసీఏఆర్-ఐఐవీఆర్ లో రైతులకు ఐదు రోజుల ఆచరణాత్మక శిక్షణ ప్రారంభం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం గాజా శిథిలాల తొలగింపు 'సాక్ష్యాల' విధ్వంసమే అబుదాబి, దుబాయ్‌లలో పర్యటించనున్న ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ

అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్

Select Suryaa Now
అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మంగళవారం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (PS) రాజు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి వకిటి శ్రీహరి, అప్రమత్తమై ఆయనకు సమయస్ఫూర్తితో సీపీఆర్ (CPR) చేసి ప్రాణాపాయం నుండి కాపాడేందుకు ప్రయత్నించారు.

సకాలంలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, అసెంబ్లీలోని వైద్య సిబ్బంది సహాయంతో రాజును వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో స్పందించి సీపీఆర్ చేసిన మంత్రి వకిటి శ్రీహరి సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని పలువురు నాయకులు, అధికారులు అభినందించారు.