మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి.. కలెక్టర్
సూర్య పెద్దపల్లి ప్రతినిధి :
జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మెగా హెల్త్ క్యాంప్ పోస్టర్‌ను సోమవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.సెప్టెంబర్ 23న స్థానిక ఆయుష్ వింగ్స్ హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లిలో జరిగే ఈ మెగా హెల్త్ ఆయుర్వేద క్యాంప్‌ను పెద్దపల్లి జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ జి.ఎన్. అరుణ, ఆయుర్వేద సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి. శోభారాణి, వైద్యాధికారులు డాక్టర్ కె. అమర్‌నాథ్, డాక్టర్ వి.మారుతి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్. విద్యాసాగర్,తదితరులు పాల్గొన్నారు.