లలిత త్రిపుర సుందరి దేవిగా ఏడుపాయల వనదుర్గామాత
పాపన్నపేట;ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గాభవాని అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన శనివారం నాడు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక మండపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.