BREAKING
అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు

తుక్కుగూడ హత్యాచార బాధితురాలి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

Select Suryaa Now
తుక్కుగూడ హత్యాచార బాధితురాలి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ

రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
హైదరాబాద్/కొత్తగూడెం: తుక్కుగూడలో దారుణంగా ఉన్మాది చేతిలో హత్యాచారానికి గురైన నర్సు కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, వారిని పరామర్శించారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ పరంగా పోరాడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, దోషికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.


కేటీఆర్ సూచనల మేరకు బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు చౌటిగూడెంలోని బాధిత యువతి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, రూ. 50,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం మరియు బాధితులకు వేగవంతమైన న్యాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.