BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

Select Suryaa Now
జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

జల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
న్యూఢిల్లీ: దేశంలో జల డేటా పాలనను బలోపేతం చేయడానికి మరియు నీటి సంరక్షణ, వినియోగాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘జాతీయ జల శాఖా సదస్సు’ ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.

సమర్థవంతమైన జల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఫార్మాట్ ద్వారా జల డేటాను సేకరించి, విశ్లేషించడానికి ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రధాని సూచించారు. ఈ సదస్సు కేవలం ఒక్కసారి జరిగే కార్యక్రమంగా మిగిలిపోకూడదని, కాలపరిమితితో కూడిన ప్రణాళికలతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

నీటి పొదుపు, సంరక్షణపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ‘జల్ ఉత్సవ్’ను ప్రోత్సహించాలి. వ్యవసాయం, పారిశ్రామిక అవసరాల కోసం శుద్ధి చేసిన నీటిని (Treated Water) సమర్థవంతంగా పునరుపయోగించాలి.ప్రతి రుతుపవనాలకు ముందే ఆనకట్టల భద్రతా చర్యలు పూర్తి చేయాలి. నీటి యాజమాన్యంపై పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఉత్తమ జల నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో క్రమబద్ధమైన అంతర్రాష్ట్ర పర్యటనలు ఏర్పాటు చేయాలి.


కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ.. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం, తాగునీటి వనరుల దీర్ఘకాలిక స్థిరత్వం, గ్రామీణ తాగునీటి పథకాల సమర్థవంతమైన పర్యవేక్షణ వంటి నాలుగు కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించిందని వెల్లడించారు.