BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

ఏరోస్పేస్‌, డిఫెన్స్ రంగంలోకి మంత్రి పొంగులేటి కుటుంబం

Select Suryaa Now
ఏరోస్పేస్‌, డిఫెన్స్ రంగంలోకి మంత్రి పొంగులేటి కుటుంబం

హైదరాబాద్‌లో 'రాఘవ ఏరోస్పేస్' ప్రారంభం
హైదరాబాద్: ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ ఆయుధ తయారీ రంగంలోకి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని కోకాపేట్ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన "రాఘవ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (RADPL)" కొత్త సదుపాయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సంస్థకు మంత్రి కుమారుడు పొంగులేటి లిఖిత్‌ రెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (MD)గా వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి. సతీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతిదారుగా ఎదుగుతోందని, అందులో ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని సతీశ్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (R&D), ఎలక్ట్రానిక్స్ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, కాంపోజిట్‌ స్ట్రక్చర్ల తయారీపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించనుంది. మైక్రోవేవ్‌ అసెంబ్లీ కోసం క్లీన్‌ రూమ్‌లు, 40 గిగాహెర్జ్ వరకు రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్‌ పరీక్షా సదుపాయాలు మరియు ఇంటిగ్రేషన్‌ ల్యాబ్‌లను ఈ ప్లాంట్‌లో ఏర్పాటు చేశారు.

‘పెరిడాట్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్’ సంస్థతో కలిసి పూర్తిగా భారతీయ యాజమాన్య డిజైన్‌తో కూడిన MALE-300 అనే డ్రోన్/మానవరహిత విమానాన్ని జాయింట్ వెంచర్ కింద అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని పెంచడంతో పాటు అంతర్జాతీయ ఎగుమతులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పొంగులేటి లిఖిత్ రెడ్డి వెల్లడించారు.