BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్స్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి

Select Suryaa Now
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్స్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి

తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అధికారిక పర్యటనలో భాగంగా ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయువును ఆయన కలిశారు.  ఈ భేటీ సందర్భంగా వరంగల్ మామునూరు అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో భూసేకరణ చేపట్టి అప్పగించిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్‌లో శంకుస్థాపన నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆదిలాబాద్‌లో ప్రయాణీకుల రాకపోకలతో పాటు కార్గో టెర్మినల్స్, ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రಿಯನ್ನು కోరారు. రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా చర్చించారు