BREAKING
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ

రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్!

Select Suryaa Now
రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్!

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రెస్‌మీట్ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మాట్లాడుతూ, తమ బ్యానర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చినప్పటికీ, 'ఇరుముడి' విజయం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందని, ఇలాంటి అద్భుతాలు దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు. కేవలం నైజాం ప్రాంతంలోనే సుమారు 42 లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారని, సినిమాకు వస్తున్న ప్రేక్షకుల తాకిడి చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, రియలిస్టిక్ వరల్డ్ మరియు బలమైన ఎమోషన్స్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. తండ్రీకూతుళ్ల అనుబంధం మరియు కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని, మూడు తరాల ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారని చెప్పారు. రవితేజను పూర్తిగా కొత్త కోణంలో చూపించడంలో విజయం సాధించామని, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తనకెంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి నక్షత్ర తెలుగులో తన మొదటి సినిమాతోనే ఘన విజయం అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరింత గ్రాండ్‌గా విజయోత్సవ వేడుకను నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.