BREAKING
కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు

ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన మహానేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి

ఆరోగ్యశ్రీ, 108 సేవలతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన దార్శనికుడు వైయస్సార్ ఆయన స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ఆరోగ్య బలోపేతం

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

అందోల్ ; ప్రజా సంక్షేమమే పరమావధిగా జీవితాంతం పనిచేసిన మహోన్నత నాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ గారు మాట్లాడుతూ... "ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయడంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు అచంచలమైన నిబద్ధత చూపించారు" అని కొనియాడారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొంది, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యకు బంగారు బాటలు వేశారని గుర్తు చేశారు.వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, సామాజిక సంక్షేమం వంటి అనేక రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు."ప్రజల సంక్షేమం కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు చూపిన అంకితభావం, ప్రజాసేవా స్ఫూర్తి నేటికీ మనందరికీ మార్గదర్శకం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, పేదలు మరియు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి" అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.