BREAKING
కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

Select Suryaa Now
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ

మెదక్: పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.బుధవారం మెదక్ మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ద్వారా నిత్యావసర సరుకులు అందించడంతో పాటు, ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆరోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ తాహాసిల్దార్ లక్ష్మణ్ బాబు ,సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.