BREAKING
జనసేన యువజన విభాగంగా ‘జై కొట్టు’ ఆవిర్భావం పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’తో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్! గోదావరి జలాలను విడుదల చేసిన చంద్రబాబు దేవరాయ'గా కిచ్చా సుదీప్: శ్రీకృష్ణదేవరాయ లుక్‌తో గ్లింప్స్ విడుదల పోలవరంపై క్రెడిట్ తీసుకునే దమ్ముందా జగన్? రంభ ఊర్వశి మేనక' హాయిగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరో అల్లరి నరేష్ రోమాంచకం' ఫ్యామిలీ అంతా చూసే ఫ్రెష్ లవ్ స్టోరీ: హీరో సుమంత్ ప్రభాస్ పోలవరం ఎడమ కాలువ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు వినాయక ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు రండి రాజనాథ్ సింగ్ కు సీఎం రేవంత్ ఆహ్వానం పవన్ కల్యాణ్ 55వ బర్త్‌డే గ్రాండ్ సెలబ్రేషన్.. మోదీ నుంచి చిరంజీవి వరకు స్పెషల్ విషెస్! తెలంగాణలో మరో సంచలనం - KCR ఫ్యామిలీలో చీలిక - కవిత సొంత పార్టీ గిరిజనుల జీవితాలతో ఆటలాడుతున్న జగన్‌.. పుట్టిన రోజునాడు పవన్ ఎక్కడ ?

పోలవరంపై క్రెడిట్ తీసుకునే దమ్ముందా జగన్?

Select Suryaa Now
 పోలవరంపై క్రెడిట్ తీసుకునే దమ్ముందా జగన్?

ఏపీ స్టేట్బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

వెలిగొండ ప్రాజెక్టుకు రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్ కొట్టేసేందుకు గొడ్డలి పార్టీ నానా తంటాలు పడుతోందని... ఏపీ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్టుకు రెండేళ్లల్లో రూ.2,250 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. పోలవరం ప్రాజెక్టులో క్రెడిట్ మాదే అని చెప్పే ధైర్యం, దమ్ము జగన్‌కు లేదు. ఎందుకంటే ఐదేళ్ల పాలనలో కేవలం 2 శాతం పనులు మత్రమే జగన్ చేపట్టారు. పోలవరం ఎడమ కాలువలో 150 కి.మీ.లో 70 కి.మీ. మట్టి తవ్వి సొమ్ము చేసుకున్నారు. 72 శాతం పోలవరం పనులను 2014-19 మధ్యలో చేశాం. పోలవరంపై క్రెడిట్ మాదే అని సాక్షిలో చెప్పుకోలేక పోయారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా సాక్షిలో 5 వేల క్యూసెక్కులే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 60 రోజుల పాటు రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు ఎడమ కాలువ ద్వారా తరలించబోతున్నాం. పోలవరానికి ఏం చేయలేదనే ఆవేదన గొడ్డలి పార్టీలో కనిపిస్తోంది. 2021 పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీలో అనిల్ కుమార్ బల్ల గుద్ది చెప్పాడు. పోలవరం పనులు ఇప్పట్లో చేయలేం, నాకు ఈ ప్రాజెక్టు అర్థం కాలేదని అంబటి రాంబాబు మాట్లాడాడు. అలాంటి వారిని జలవనరుల శాఖ మంత్రులుగా పెట్టుకొని మీరు నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడితే జనాలు నవ్వుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకి వైఎస్ఆర్, జగన్, ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ఖర్చు చేసింది కేవలం రూ.2,175 కోట్లే... అందులో జగన్ రెడ్డి పెట్టింది రూ.800 కోట్లు. రూ.10,400 కోట్ల ప్రాజెక్టులో కేవలం 20 శాతం నిధులు కూడా మీరు ఖర్చు చేయలేదు. ఆ చేసిన పనుల్లో కూడా మట్టి పనులు చేసుకొని సొమ్ము చేసుకొని దోచుకున్నారు తప్పితే... కాలువల లైనింగ్ చేయలేదు, ప్యాచింగ్ వర్స్ చేయలేదు, నిర్వాసితులకు రూపాయి కూడా సాయం చేయలేదు. టన్నెల్ అరకొరగా తవ్వేసి వదిలేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ చేశారని చెబితే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు జగన్. చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలోనే రూ2,250 కోట్లు ఖర్చు చేశాం. నిర్వాసితులకు రూ.905 కోట్లు విడుదల చేసి రూ.768 కోట్లు 48 రోజులు అందజేశాం. 11 గ్రామాలను తరలించి 10.4 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించాం. 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4.3 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాం.

2014 నుంచి 2019 మధ్య కాలంలో రూ.11,762 కోట్లు ఖర్చు చేసి పోలవరం పనులను 72 శాతం పూర్తి చేశాం.  2019-24 మధ్య జగన్ రెడ్డి పాలనలో పోలవరం విధ్వంసం చేశారు. 17 నెలల పాటు పనులను నిలిపివేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని వరదల్లో ముంచేశాడు. డయాఫ్రం వాల్ విధ్వంసానికి కారణమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశాడు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.3,385 కోట్లు జగన్ ఎక్కడ ఖర్చు పెట్టాడో చెప్పాలి. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను జగన్ రెడ్డి మోసం చేశాడు. ఈ రెండేళ్ల పాలనలో రూ.8,323 కోట్లు పోలవరంపై ఖర్చు చేశాం. రికార్డ్ టైంలో 440 రోజుల్లోనే రూ.1000 కోట్లు ఖర్చు చేసి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేశాం. రూ.2,250 కోట్లు పోలవరం భూ నిర్వాసితులకు అందజేశాం. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేయబోతున్నాం.పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టకుండా కేవలం కాలువ తవ్వకం పనులు చేసి వైఎస్ఆర్ హయాంలో మట్టి పనులు చేసి దోచుకున్నారు. బండరాళ్లు అడ్డు వస్తే పట్టించుకోలేదు, లైనింగ్ వేయలేదు, కేవలం మట్టిని తవ్వి డబ్బులు చేసుకున్నారు. అది హంద్రీనీవా అయినా, వెలిగొండ అయినా, పోలవరం అయినా మట్టి పనులు చేసుకొని దోచుకోవడమే పనిగా జలయజ్ఞాన్ని ధన యజ్ఞం చేశారు.  రాయలసీమకు, కోస్తాకు, ఉత్తరాంధ్రకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. 2008లో జీఓ 104 తెచ్చి  వైఎస్ఆర్ పోలవరం ఎడమ కాలువ సామర్థ్యాన్ని 3,500 క్యూసెక్కులకు జీఓ ఇచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో 10 వేల క్యూసెక్కులకు పోలవరం ఎడమ కాలువ సామర్థ్యం పెంచాం. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసుకున్నారు. ఒక్క ఎకరాకు వైఎస్ఆర్ నీళ్లు ఇవ్వలేదు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ అక్కడ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. మట్టి తవ్వుకొని సొమ్ము చేసుకునేందుకే జలయజ్ఞం తీసుకొచ్చారు. పోలవరం నిర్వాసితులకు జగన్ రూపాయి ఖర్చు చేయలేదు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా రోజుకు 5 వేల క్యూసెక్కులు తరలించబోతున్నాం. అంటే 30 టీఎంసీల ద్వారా తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం. రెండేళ్లల్లోనే రూ.1800 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేశాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు ఇస్తే విశాఖకు నీళ్లు వెళ్తాయి. విశాఖకు 12 టీఎంసీల నీరు ఇస్తున్నాం. అందులో 4 టీఎంసీలు విశాఖ జిల్లాలోని పరిశ్రమలకు ఇస్తున్నాం. 7 నుంచి 8 టీఎంసీలు విశాఖ జిల్లాలో సాకుకు ఇవ్వబోతున్నాం.  పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు వెళ్తున్నాయి. మొత్తం రాష్ట్ర ప్రగతికి అవసరమైన పోలవరం ప్రాజెక్టును శరవేగంగా మేం పూర్తి చేస్తుంటే.... ఐదేళ్లు నిర్లక్ష్యం చేసి నేడు తప్పుడు కథనాలు రాస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. పట్టిసీమ ద్వారా రూ.70 వేల కోట్లు రాష్ట్ర రైతులు ఆదా అయింది.  మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ టీడీపీదే మళ్లీ అధికారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నారు. టీడీపీనే  మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. గొడ్డలి పార్టీకి గతంలో కంటే ఒక ఎంపీ సీటు పెరిగింది. దొంగ సర్వేలు చేసుకోవడం కాదు. నిజమైన సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.